మంత్రులకు వరుసగా నిరసన సెగలు తగులుతున్నాయి. నిన్నబీజేవైఎం నేతలు అడ్డుకుంటే... ఇవాళ యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రుల కాన్వయ్‌కు అడ్డుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మేకగూడ దగ్గర మంత్రులు కేటీఆర్, సబితా, ఎర్రబెల్లి దయాకర్ రావుల కాన్వాయ్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. గ్రామ శివారులో ఓ కంపెనీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళ్తుండగా అడ్డుకున్నారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అందరినీ అదుపులోకి తీసుకుని కొత్తూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
