
హైదరాబాద్, వెలుగు: బిహార్ దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ దళిత విద్యార్థులను కలవనీయకుండా లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై శనివారం గాంధీ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అనంతరం వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే మోదీ సర్కార్ ఆయన పర్యటనను అడ్డుకుంటుందని ఆరోపించారు.