పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతా రోహిత్ డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. విద్యానగర్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ సిలిండర్ నమూనాలో తయారు చేసిన కేక్ కట్ చేసి ప్రజలకు, ప్రయాణీకులకు పంచి నిరసన వ్యక్తం చేశారు. 

గత యూపీఏ ప్రభుత్వంలో 410 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆందోళన చేశారు.. మరి ఇప్పుడు ఎన్డీయే పాలనలో 1105 రూపాయలు ఉంటే మాటలు రావట్లేవా అని మోతా రోహిత్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతుందని ఆరోపించారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ.. దాని అనుబంధ సంఘాలుగా తాము చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని రోహిత్ తెలిపారు.