కావాలనే ఇష్యూ పెద్దది చేస్తున్నరు: ప్రశాంత్

కావాలనే ఇష్యూ పెద్దది చేస్తున్నరు:  ప్రశాంత్

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వీడియోలు ఫార్వార్డ్ చేసిన నంబర్  చలమల రామృష్ణ పేరు మీద ఉందన్నారు  యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జ్ ప్రశాంత్.  తాను పరారీలో లేనని పోలీసుల విచారణకు హజరై వివరణ ఇస్తానన్నారు. ఎక్కడో చిన్న మిస్ కమ్యూనికేషన్ తో పొరపాటు జరిగిందన్నారు. ఇది పెద్ద సమస్య కాదని.. కావాలనే పెద్దదిగా  చేస్తున్నారని చెప్పారు. ఉత్తం కుమార్ రెడ్డిపై గౌరవం ఉందని తాము కావాలని వీడియోలు ఫార్వార్డ్   చేయలేదన్నారు. ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని  వివరణ ఇస్తానని చెప్పారు. 

తనపై ట్రోల్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి   యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్  ప్రశాంత్ పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశాంత్ కు  41 CRPC కింద నోటీసులు ఇచ్చారు.  ఈ క్రమంలోనే ప్రశాంత్  సైబర్ క్రైం పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

ఉత్తమ్ ఫిర్యాదుతో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసు సోదాలు జరిపారు. ఐదు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  ప్రశాంత్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా రూమ్ నడుస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే కొంతమంది రాజకీయ నేతలపై ట్రోలింగ్ పోస్టులు అప్ లోడ్ అవుతున్నట్లు చెప్పారు.