ఇన్ స్టా లో పర్సనల్ ఫోటోస్ షేర్ చేస్తున్నారా..? గుర్తు తెలియని వ్యక్తుల్ని ఫాలో అవుతున్నారా..? మీకు తెలియని అనుమానితులు మీ ప్రొఫైల్ ను ఫాలో అవుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.
ఢిల్లీకి చెందిన ఓ నలుగురు యువకులు పలు ఇన్ స్టా అకౌంట్ల నుంచి యువతుల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. బయాస్ లాకర్ రూమ్ పేరుతో ఇన్ స్టా గ్రామ్ గ్రూప్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆ గ్రూప్ సభ్యులు యువతుల ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. మాయ మాటలు చెప్పి వారి ఫోటోల్ని రహస్యంగా తీసుకుంటున్నారు. ఆ ఫోటోల్ని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారు. అంతేకాదు ఆ ఫోటోల్ని పలు గ్రూప్ ల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా అసభ్యంగా ఉన్న తన ఫోటోల్ని చూసిన ఓ బాధితురాలు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుల వద్ద నుంచి వందల కొద్ది మార్ఫింగ్ ఫోటోల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐటి యాక్ట్ సెక్షన్ 66 ఎ కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.
