సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్

సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్ర వేసుకోవాలని, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది యవత కోరుకుంటున్నారు. ఫ్యాషన్​పై ఇష్టంతో తమ టాలెంట్, క్రియేటివిటీని నిరూపించుకునేందుకు చాలామంది ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కెరీర్ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. డిజైనర్ వేర్​కి పెరిగిపోతున్న డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని సొంతంగా బొటిక్ లు పెట్టుకోవాలనే ఆశయంతోనూ ఈ రంగంలోకి వస్తున్నారు. అదిరిపోయే డ్రెస్​లను డిజైన్ చేస్తూ సత్తా చాటుతున్నారు. 

ముంబయికి పోటీగా..

ప్రస్తుతం చాలామందికి ఫ్యాషన్ సెన్స్ పెరుగుతోంది. లేటెస్ట్ ట్రెండ్స్​ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాషన్ డిజైనింగ్​కు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సులకు సంబంధించి ఒకప్పుడు ముంబయిలోనే అధికంగా కాలేజీలు ఉండేవి. కానీ ముంబయికి పోటీగా ఇప్పుడు సిటీ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా మారుతోంది. నిఫ్ట్, హ్యామ్స్ స్టెక్, లకోటియా లాంటి ప్రముఖ ఇనిస్టిట్యూట్లతో పాటు చిన్న ఇనిస్టిట్యూట్లు కూడా ఫ్యాషన్ కోర్సులను అందిస్తున్నాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు కూడా సిటీకి వచ్చి ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్లలో చేరుతున్నారు.

ఇనిస్టిట్యూట్లలో సీట్ల పెంపు..

అడ్మిషన్లు పెరగడంతో అందుకు అనుగుణంగానే ఇనిస్టిట్యూట్లు సీట్ల సంఖ్యను కూడా పెంచుతున్నాయి. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంట్రెన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన నిఫ్ట్.. ఆ తర్వాత పేరెంట్స్, స్టూడెంట్లతో ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అప్లికేషన్ విధానం, ఇతర విషయాలపై వారికి అవగాహన కల్పించింది. ఒక్కో గ్రూప్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్ల రెస్పాన్స్ ని బట్టి 50 నుంచి 100కు సీట్లను పెంచుతున్నారు. గతంతో పోలిస్తే 15 నుంచి 20శాతం అడ్మిషన్లు పెరిగాయి. ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్ టైల్ డిజైన్, నిట్ వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అప్పీరల్ ప్రొడక్షన్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్ మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది.


ఉపాధి అవకాశాలు పెరుగుతున్నయ్

ఈ కోర్సులు చేసి వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సొంతంగా బొటిక్​లు పెట్టుకుని ఫ్యాషన్ రంగంలో స్థిరపడుతున్నరు. మా దగ్గర డిఫరెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్లకు సంబంధించి స్టూడెంట్లకు ఎలాంటి సందేహాలున్నా క్లియర్ చేస్తున్నం. అడ్మిషన్లకు అనుగుణంగా సీట్లను పెంచుతున్నం.  

కిషోర్ చంద్ర, అధికారి, నిఫ్ట్‌‌‌‌‌‌‌‌


ఇతర కోర్సులకు భిన్నంగా..

ఇంటర్​ తర్వాత డిగ్రీ కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరా. ప్రస్తుతం ఫ్యాషన్ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఫ్యాషన్ సెన్స్​తో ఉంటున్నారు. అందుకే  ఈ రంగాన్ని ఎంచుకున్న. ఫ్యాషన్ కమ్యూనికేషన్ వల్ల రీసెంట్ ట్రెండ్స్ గురించి తెలుసుకునే వీలుంటుంది. దీంతో కొత్త డిజైన్లు చేసే చాన్స్ ఉంటుంది. భవిష్యత్​లో సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు. - 

దుర్గ, స్టూడెంట్, లకోటియా కాలేజ్​ ఆఫ్ డిజైన్, బంజారాహిల్స్​