నిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

నిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

లోకేశ్వరం, తెలుగు: అకాల వర్షం రైతులను ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన నేలకొరిగింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి నిర్మల్ ​జిల్లా లోకేశ్వరం మండలంలోని పుస్పూర్, రాయపూర్ కాండ్లి, హద్గం, సాతుగాం, పొట్​పల్లి, నరసింహనగర్ తండా, సేవాలాల్ తండా తదితర గ్రామాల్లో సుమారు 700 వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.

మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆనందపడ్డ రైతు కళ్లల్లో కన్నీరు మిగిల్చింది. మొక్కజొన్న పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.