- మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో దాడులు చేయడం, బెదిరింపులు పాల్పడటం, అక్రమాలకు పాల్పడే సంస్కృతి బాల్క సుమన్దేనని కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. మంగళమవారం మందమర్రిలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు సొతుకు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన 14 మంది మోజార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పుడు పాలకవర్గం విషయంలో బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లను బాల్క సుమన్నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి చేజారిపోతుందనే బాల్క సుమన్ తన అనుచరులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించాడని మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో సుమన్దాడులు, అరాచకాల సంస్కృతిని మళ్లీ మొదలుపెట్టాడన్నారు. మహిళ కౌన్సిలర్లను అవమానించేలా సుమన్ అసభ్యకరంగా మాట్లాడి వారిని కించపరిచాడని ఫైర్ అయ్యారు. కాకా కుటుంబంతో బాగుపడ్డ బీఆర్ఎస్ లీడర్ మద్ది శంకర్ విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేక మంత్రి, కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు పైడిమల్ల నర్సింగ్, ఉపేందర్‌గౌడ్, మంద తిరుమల్, పాషా, ఎన్.శ్రీనివాస్, జమీల్, రమేశ్, ఎర్ర రాజు, మాయ తిరుపతి, వెంకటేశ్, సంతోష్, వీరన్నతదితరులు పాల్గొన్నారు.
