ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వలో యువకుడు గల్లంతు

ఖమ్మం జిల్లాలో  సాగర్ కాల్వలో యువకుడు గల్లంతు

తల్లాడ,  వెలుగు :  ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వలో యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం ఏన్కూర్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం..  తిమ్మారావుపేట గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్  సమీపంలోని సాగర్ కెనాల్ లో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఏన్కూర్ పోలీసులు కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ దొరకలేదు.