యూత్ ఓపెన్ రెగట్టా 2026: రవి కుమార్‌‌‌‌ శుభారంభం

యూత్ ఓపెన్ రెగట్టా 2026: రవి కుమార్‌‌‌‌ శుభారంభం

హైదరాబాద్‌‌, వెలుగు: సికింద్రాబాద్ క్లబ్ వేదికగా హుస్సేన్‌‌సాగర్ వేదికపై '6వ వైఏఐ జీఎమ్‌‌ఆర్‌‌ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా 2026 పోటీల్లో ఇండియా సెయిలర్‌‌  రవి కుమార్‌‌ (టీఎస్‌‌ఏ) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన బాలుర ఆప్టిమిస్ట్‌‌ మెయిన్‌‌ ఫ్లీట్‌‌ విభాగంలో రవి 9 పాయింట్లు సాధించాడు.

బాలికల కేటగిరీలో సికింద్రాబాద్‌‌ సెయిలింగ్‌‌ క్లబ్‌‌కు చెందిన శృంగారి రాయ్‌‌ 3 పాయింట్లతో టాప్‌‌లో కొనసాగుతోంది. తొలి రోజు ఆరు రేసులు నిర్వహించారు. వర్షం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురైనా తర్వాత వాతావరణం అనుకూలించడంతో సెయిలర్లు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.

అనుకూలమైన గాలులు, వాతావరణం కారణంగా మొదటి రోజు అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేసింగ్ పూర్తయిందని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ కమోడోర్ అర్జున్ ప్రదీపక్, నిర్వాహకుడు అజయ్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు.