కౌన్సెలింగ్ : కష్టాల్లో యువత ఆలోచన ఇలా ఉండాలి.. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోరు..!

కౌన్సెలింగ్ : కష్టాల్లో యువత ఆలోచన ఇలా ఉండాలి.. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోరు..!

ఈ మధ్యకాలంలో జనాలకు  ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.  యువతలో ఆత్మహత్య కు డిప్రెషన్​ అని ఓ స్టడీలో తేలింది. ఇలాంటి టైమ్ లో వచ్చే సూసైడల్ థాట్స్ ని ఎలా సైడ్ ట్రాక్ పట్టించాలి..   నిపుణులు సూచిస్తున్న సలహాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఏదైనా ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం యాంగ్జెటీ. అది కాస్తా... పెరిగి.. పెరిగి డిప్రెషన్ అవుతుంది. ఆ డిప్రెషన్ సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది.  సూసైడల్ థాట్స్ పెరగడానికి  డిప్రెషన్ కారణమవుతుందని అమెరికాకు చెందిన ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్...   అధ్యయనం చేసిన  స్టడీ ద్వారా తెలుస్తుంది. అయితే, మన దగ్గర ఇలాంటి స్టడీలు అంతగా జరగవు. కానీ, ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంటుందనడంలో డౌటేం లేదు. 

ఎందుకంటే ఈ  డిప్రెషన్ ..మనందరి జీవితాలపై ప్రభావం చూపుతోంది.  ప్రస్తుతం సాఫ్ట్​వేర్​ రంగంలో ఎంతోమందికి  జాబ్స్ పోయాయి. ఇంకా కొన్ని కంపెనీలు లేఆఫ్స్​ ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నాయి కూడా.. ఇలాంటి పరిస్థితులు డిప్రెషన్​ కు లోను కావడం.. అది కాస్త   ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపడం లాంటివి  జరుగుతున్నాయి. 

►ALSO READ | Good Food : వర్షాల వేళ.. గరం గరం పుదీనా రసంతో అన్నం తింటే.. జలుబు, దగ్గు ఇట్టే మాయం..!

పిల్లల స్కూల్స్​..  కాలేజీస్​.. హెల్త్​.. ఇంటి ఖర్చులు.. ఈఎమ్మైఐలు..    మొదలైన విషయాలు .. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల్లో స్ట్రెస్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇలాంటి టైమ్ లో వచ్చే సూసైడల్ థాట్స్ ని  జనాలు ఎంచుకుంటున్నారు.  కాని ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొన్ని  చిట్కాలను పాటించాలని   సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రిపోర్ట్​ లో  తెలిపారు. 

అన్నింటికన్నా ముందు ఈ పరిస్థితికి... మనం కారణం కాదని గుర్తుంచుకోవాలి. జీవితంలో ఫెయిల్ కావడానికి ఈ పరిస్థితే కారణమని కూడా అనుకోవద్దు. మనం దేన్ని కంట్రోల్ చేయగలమో.... దాని మీద ఫోకస్ పెట్టేందుకు .. ఇప్పుడు ట్రై చేయాలి. స్ట్రెస్, యాంగ్జెటీని కేవలం మనమే ఫేస్ చేస్తున్నాం అనుకోవద్దు.
 మనల్ని మనం కరుణతో ట్రీట్ చేసుకోవాలి. వాకింగ్ కి పోవాలి. పన్నీ టీవీ షోస్ చూడాలి. మ్యూజిక్ వినాలి. పెయిన్​ లో  ఉన్నప్పుడు... ఫన్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెడితే కచ్చితంగా కొంత రిలీఫ్ ఉంటుంది.

ఆశగా ఉండాలి

మనిషి మెదడు సహజంగానే పాజిటివ్ ఆలోచనల కంటే.. ప్రమాదకరమైన వాటి మీదికే మొగ్గుతుంది. ఇలాంటి టైమ్​ లో  ఆశ మీదే దృష్టి పెట్టాలి. ఈ ప్రపంచంలో కరుణతో మాట్లేడేవాళ్లు, సాయం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల గురించి చదవాలి. వీలుంటే మాట్లాడాలి. డాక్టర్లు, సైంటిస్టులు ఫ్యూచర్ మీద ఆశ కలిగిస్తున్నారు. సూసైడ్ ఆలోచనలు. వస్తున్నప్పుడు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడాలి.  వీలుంటే వీడియో ఛాట్​ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. స్టోరీస్, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం వల ఎంకరేజ్ మెంట్ దొరుకుతుంది. మూడ్ మారుతుంది.

హెల్ప్ చేయాలి

ఇలాంటి టైమ్ లో... నేను ఇతరులకు ఎలా సాయం చేయగలను?  అని ఆలోచించాలి..మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నామో ఆలోచించాలి. ఇతరులతో పోల్చుకుంటున్నప్పుడు.. మనకు మనం క్రెడిట్ ఇచ్చుకోవాలి. ఈ టైమ్​ లో  మన రిలేషన్ షిప్ ని ఏమైనా బలంగా మార్చుకున్నామా? ఈ టైమ్​ లో  ఏవైనా కొత్త విషయాల్ని నేర్చుకుంటున్నామా? ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తే.. మనసు ఏం కోరుకుంటుంది? ఎలా ఉందనే విషయం క్లియర్​ గా  అర్థమవుతుంది.

ఫిజికల్ సేఫ్ట్

సూసైడ్​ ను  ఈజీగా మార్చే.. పిల్స్, బ్లేడ్స్, కత్తులు, తాళ్లు... లాంటి వాటిని మన దగ్గర లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఇలాంటివి చూసినప్పుడు ఎమోషనల్ థాట్స్ ఇంకా పెరిగే చాన్స్ ఉంది. దీన్నే ఫిజికల్ సేఫ్టీ అంటారు