
షణ్ముఖ్ జస్వంత్, ఉల్క గుప్తా జంటగా వి. భీమ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శివాజీ, భూమిక కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. మంగళవారం షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ‘ప్రేమకు నమస్కారం’ అనే పేరును ఖరారు చేస్తూ, టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇదొక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.
లవ్ ఫెయిల్యూర్స్, లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ.. వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారని ఫన్నీగా బాధలు పంచుకోవడం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఫైనల్‌గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గ్యానీ సంగీతం అందిస్తున్నాడు.