
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ చేసే వీడియోలకు ఎలా హైప్ తెచ్చుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిన్న క్రియేటర్లు మాత్రం ఆ రేంజ్లో హైప్ తెచ్చుకోవడానికి కొన్ని సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న క్రియేటర్ల వీడియోలకు కూడా హైప్ పెంచేందుకు యూట్యూబ్ ‘హైప్’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇది ఐదు వందల నుంచి ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్న క్రియేటర్ల కోసం స్పెషల్‌గా డెవలప్ చేసిన ఫీచర్. అర్హత ఉన్న వీడియోలకు కింద లైక్ బటన్ పక్కన కొత్తగా హైప్ బటన్ కనిపిస్తుంది. వ్యూయర్లు ఈ బటన్ క్లిక్ చేస్తే, ఆ వీడియోకి హైప్ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్ల ఆధారంగా ఆ వీడియో ఉత్తమమైన వందమంది ఉన్న లీడర్ బోర్డులోకి చేరుతుంది.
ఈ లీడర్ బోర్డ్, యూట్యూబ్ లోని ఎక్స్ప్లోర్ ట్యాబ్‌లో ఉంటుంది. చిన్న చానెల్స్‌కు బోనస్ పాయింట్లు రావడం వల్ల అవకాశాలు పెరుగుతాయి. అయితే, ఈ ఫీచర్‌ని ఉపయోగించే క్రియేటర్‌కి కొన్ని అర్హతలు ఉండాలి. ఒకటి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో మెంబర్షిప్ ఉండాలి. 500 నుంచి ఐదు లక్షల మధ్య సబ్స్రైబర్లు ఉండాలి. వీడియో కొత్తగా పబ్లిష్ చేసినదై ఉండాలి.
అర్హత ఉన్న చానెళ్లకు ఆటోమెటిక్‌గా హైప్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. లీడర్ బోర్డ్‌లో ఉన్న వీడియోలు యూట్యూబ్ ఎక్స్ప్లోర్ ట్యాబ్‌లో ఎక్కువగా కనిపించడంతోపాటు రికమెండేషన్లలో ప్రియారిటీ దక్కుతుంది. ఇదంతా క్రియేటర్ల కోసమైతే.. వ్యూయర్లకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అంటే.. యూట్యూబ్‌లో హైప్ ఫీచర్ ద్వారా వ్యూయర్లు తమకు నచ్చిన క్రియేటర్లకు డైరెక్ట్‌గా సపోర్ట్ ఇవ్వగలరు. ప్రతి యూట్యూబ్ యూజర్ వారానికి మూడు వీడియోలను ఉచితంగా హైప్ చేయొచ్చు.