వీడియో: బాటిల్స్‌‌, హెయిర్​ బ్రష్​లు తింటున్న యువతి

వీడియో: బాటిల్స్‌‌, హెయిర్​ బ్రష్​లు తింటున్న యువతి

ఈ ఫొటో గమనించారా! బాటిల్స్‌‌, హెయిర్​ బ్రష్​లు ఎంత బాగున్నాయో! ‘బొమ్మలెంత బాగున్నాయో అనుకునేంతలోనే వాటన్నింటినీ పరపరా నమిలేస్తుంది.’ కానీ అవి బొమ్మలు, వస్తువులు కావు. జెల్లీస్‌‌, కుక్కీస్‌‌!

కాలం కలిసొస్తే అదృష్టం నడిచొస్తుంది అనేందుకు ఈమె బెస్ట్‌‌ ఎగ్జాంపుల్‌‌. ఎందుకంటే కూర్చొని తింటే చాలు యూట్యూబ్‌‌లో మిలియన్స్‌‌లో ఫాలోవర్స్‌‌, కోట్లలో డబ్బులు వస్తున్నాయి ఈవిడకు. తన పేరే నవోమి మక్రే. తనకు ‘హన్నిబీ ఎఎస్‌‌ఎమ్‌‌ఆర్‌‌‌‌’(HunniBee ASMR) అనే యూట్యూబ్‌‌ ఛానల్‌‌ ఉంది. కెమెరా ముందు కూర్చుంటుంది. మాట కూడా మాట్లాడదు. 
రకరకాల ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ తింటూ వీడియో రికార్డ్‌‌ చేసి తన యూట్యూబ్‌‌ ఛానల్‌‌లో అప్​లోడ్‌‌ చేస్తోంది 27 ఏండ్ల నవోమి. దానికి మిలియన్స్‌‌లో వ్యూస్‌‌, కోట్లలో డబ్బులు సంపాదిస్తోంది. తింటున్న వీడియోలకు అంత ఆదరణ ఎలా వచ్చింది? అంటే... వీడియోలను ‘ఎఎస్‌‌ఎమ్‌‌ఆర్‌‌’ టెక్నాలజీతో చేస్తుంది. అంటే ‘అటానమస్‌‌ సెన్సరీ మెరిడియన్‌‌ రెస్పాన్స్‌‌’. దీనివల్ల వీడియోలు చూసినపుడు అవి శరీరం నిద్రపోయేలా, విశ్రాంతి తీసుకునేలా చేస్తాయి. దీన్నే ‘బ్రెయిన్‌‌ టింగిల్స్‌‌’ అంటారు. ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ తింటున్నపుడు వాటి సౌండ్స్‌‌ క్లియర్‌‌‌‌గా వినిపించేలా రికార్డ్‌‌ చేస్తుంది. 
తను తినే ఫుడ్‌‌లో దువ్వెన, క్యాండీస్‌‌, డిజర్ట్స్‌‌, మ్యాకరూన్స్‌‌, చాక్లెట్స్‌‌ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ జెల్లీస్‌‌, కుక్కీస్‌‌తో తయారుచేస్తారు. ఎఎస్‌‌ఎమ్‌‌ఆర్‌‌ కోసం ఎలా తినాలి? ఎలా మాట్లాడాలి? అనేదానిపైన బాగా ప్రాక్టీస్‌‌ చేసింది. కొన్నేండ్ల ముందే యూట్యూబ్‌‌ ఛానల్​ స్టార్ట్‌‌ చేసినా అనుకున్నంత ఆదరణ రాలేదు. కరోనా వల్ల వీడియోలను చూసేవాళ్లు పెరిగారు. దాంతో కొత్తగా ఎఎస్‌‌ఎమ్‌‌ఆర్‌‌ కాన్సెప్ట్‌‌తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు తన ఛానల్‌‌కు 7.7 మిలియన్ సబ్‌‌స్క్రైబర్‌‌‌‌లు ఉన్నారు. నెలకు కోట్ల రూపాయల దాకా సంపాదిస్తోంది నవోమి.