యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్ అరెస్ట్

యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్ అరెస్ట్

ప్రముఖ యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్ ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. మార్చి 16వ తేదీ రాత్రి గురువారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 2022, డిసెంబర్ 16వ తేదీ రాత్రి.. తన పుట్టిన రోజు సందర్భంగా.. అక్షరథామ్ నుంచి ఘజియాబాద్ జాతీయ రహదారిపై.. కారులో వేగంగా వెళుతూ.. కారు రూఫ్ క్లాస్ ఓపెన్ చేసి.. దానిపై డ్యాన్స్ చేస్తూ.. కేక్ కట్ చేస్తూ.. ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు ప్రిన్స్ దక్షిత్. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అయితే ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా.. మిగతా వాహనదారులకు అసౌకర్యం కల్పిస్తూ.. ప్రిన్స్ దక్షిత్ వ్యవహరించారని.. అతని చర్యలు తీసుకోరా అంటూ ఢిల్లీ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ వీడియోపై అప్పట్లోనే స్పందించిన ఢిల్లీ పోలీసులు.. విచారణ చేసి చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పోలీసులు.. 2023, మార్చి 17వ తేదీ గురువారం రాత్రి సడెన్ గా యాక్షన్ లోకి దిగారు. ప్రిన్స్ దక్షిత్ ను అరెస్ట్ చేశారు. దక్షిత్ తోపాటు ఉన్న అతని స్నేహితులు పరారీలో ఉన్నారని.. వారికి కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు పోలీసులు. 

యూట్యూబర్ దక్షిత్ అరెస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మూడు నెలల తర్వాత సడెన్ గా చర్యలకు దిగటం ఏంటనే ప్రశ్న వేస్తున్నారు. ఆ రోజు కారులో వెళుతూ డ్యాన్స్ చేసిన వారు వీడియో స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంకా దొరకలేదు.. కనిపించటం లేదు అని చెప్పటం ఏంటనే ప్రశ్నలు వేస్తున్నారు. ఆలస్యంగా అయినా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇన్ఫులెన్స్ చేసే యూట్యూబర్స్ ఇలాంటి సాహసాలు చేస్తే.. మిగతా వాళ్లు వాటిని అనుకరించే ప్రమాదం ఉందని.. నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సూచిస్తున్నారు నెటిజన్లు.