
అంబర్‌పేట, వెలుగు: ప్రేమ పేరుతో యువతిని లోబరుచుకుని.. పెండ్లి చేసుకోకుండా ముఖం చాటేసిన యూట్యూబర్ పై అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ అంబర్‌పేట సీఈ కాలనీలో ఉండే యువతికి యూట్యూబర్ చలమల శంకర్‌గౌడ్(34) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెండ్లి చేసుకుంటానంటూ మూడేండ్లుగా ఆమెను లోబర్చుకున్నాడు.
ఇటీవల సదరు యువతి పెండ్లి ప్రస్తావన తీసుకురాగా స్పందన లేదు. దీంతో బాధితురాలు అంబర్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శంకర్‌గౌడ్‌ను అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించారు. అతని నుంచి ఫోర్డ్ కారు, ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.