యువతిని మోసం చేసిన యూట్యూబర్ అరెస్ట్

యువతిని మోసం చేసిన యూట్యూబర్ అరెస్ట్

గండిపేట, వెలుగు : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన యూట్యూబర్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. చందుగాడు(పక్కింటి కుర్రాడు) పేరుతో ఫేమస్‌‌‌‌‌‌‌‌ అయిన యూట్యూబర్ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ సాయికిరణ్‌‌‌‌‌‌‌‌ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

2021 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 25న తన బర్త్​ డే రోజున  తనను ఇంటికి పిలిచి చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ లైంగిక దాడికి పాల్పడ్డాడని..పెళ్లి చేసుకోకుండా దాట వేస్తూ వస్తున్నాడని బాధిత యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్​పై అత్యాచారం, మోసం కింద 420, 376(2) సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరిపైనా కేసు ఫైల్ చేశారు. చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.