విజయ్ దేవరకొండపై ఫేక్ వీడియోలు.. యూట్యూబర్ అరెస్ట్

విజయ్ దేవరకొండపై ఫేక్ వీడియోలు..  యూట్యూబర్ అరెస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి మూవీస్ తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండపై ఓ వ్యక్తి..యూట్యూబ్ ఛానెల్ వేదికగా కొన్ని అసభ్యకర వార్తలు,వీడియోస్ ప్రసారం చేశాడు. దీంతో ఆ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇంతకీ ఏం జరిగింది?

అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి.. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్‌ ని రన్ చేస్తున్నాడు. ఈ ఛానల్ లో హీరో విజయ్ దేవరకొండని అవమానిస్తూ..ఫేక్ వీడియోల్ని, వార్తల్ని ప్రసారం చేశాడు.ఈ వీడియోలో విజయ్ దేవరకొండ గౌరవాన్ని,తన స్థాయిని కించపరిచేలా, అంతేకాకుండా..ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానించేలా ఈ వీడియోలు ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో విజయ్ ఫ్యాన్స్..వీటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..వారు వెంటనే స్పందించి వెంకట కిరణ్ అనే వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు. ఇక ఆ వ్యక్తిపై (కేసు నెంబర్: 2590/2023 గా) కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి  ఆ వీడియోలనీ, ఛానల్ ని పూర్తిగా డిలీట్ చేయించారు పోలీసులు. భవిష్యత్ లో ఇంకెప్పుడు ఇలాంటి వీడియోస్ చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు..టార్గెటెడ్ గా .ఇంకెవ్వరు అయినా తప్పుడు వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియా లో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా..అందుకు తగిన కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం ఆయన పరశురామ్(Parasuram) దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్(Family star) అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపీ సుందర్(Gopi sundar) సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరొక సినిమా చేస్తున్నారు.