శ్రీదేవి డెత్ కేసు : యూట్యూబర్ పై సీబీఐ కేసు 

 శ్రీదేవి డెత్ కేసు : యూట్యూబర్ పై సీబీఐ కేసు 

ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు ఆకతాయిలు. బతికున్న వారి దగ్గర నుంచి చనిపోయిన వారి వరకు అందరిని తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఈ బాటలోనే ఒడిశాకు చెందిన ఓ మహిళ వచ్చి చేరింది.  అందాల తార శ్రీదేవిని ఓ యూట్యూబర్ తన స్వార్థానికి వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని వీడియో వదిలింది. తీర చూస్తే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేసిందని అధికారుల విచారణలో తెలిసింది. ఇంతకు ఏం జరిగిందంటే

అందాల తార శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీప్తి అనే యూట్యూబర్ ఓ వీడియో వదిలింది. శ్రీదేవి మరణంపై తాను సొతంగా విచారణ జరపానని, శ్రీదేవి మృతి విచారణలో యూఏఈ, భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలతోపాటు, సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించింది. 

శ్రీదేవి ఒక్కరే కాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశ ఇతరుల మృతిపై సొంత పద్ధతిలో దీప్తి దర్యాప్తు చేసినట్టు పలు వీడియోల్లో తెలిపింది. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ విషయం పై ముంబైకి చెందని లాయర్ చాందినీ షా.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె చూపిన పత్రాలన్నీ నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో దీప్తి లాయర్‌ భరత్‌ సురేశ్‌ కుమార్‌ పేరును కూడా చేర్చారు. 

విచారణ జరిపిన సీబీఐ అధికారులు దీప్తి సెల్ ఫోన్, మొబైల్స్, ల్యాప్ టాప్ లను చెక్ చేశారు. దీప్తీ చూపించినవి ఫేక్ పత్రాలని సీబీఐ అధికారులు గుర్తించారు.  దీంతో దీప్తిపై సీబీఐ అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు.