
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జగన్ ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గాజువాకలో జగన్ ప్రచారం చేయనున్నారు