రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు

రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు

రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల అభిప్రాయపడ్డారు. ఏపీలో పార్టీ పెడుతున్నారా.. అన్న ప్రశ్నపై చిట్ చాట్ లో వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టొదని రూల్ ఏం లేదు కదా... తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామని ఆమె స్పందించారు. ఈనెల 19 లేదా 20 నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆమె అన్నారు.నిబంధనల ప్రకారం చేపడతామన్నా.. రైతు ఆవేదన యాత్రకి అనుమతి లేదంటున్నారని షర్మిల విమర్శించారు. రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డురావని... ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే నిబంధనలని మండిపడ్డారు. సమస్యలు పక్కదారి పట్టించేందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని షర్మిల అన్నారు.

ఇవి కూడా చదవండి:

బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్

డీజీపీపై మండిపడ్డ ఎంపీ అర్వింద్