డీజీపీపై మండిపడ్డ ఎంపీ అర్వింద్

డీజీపీపై మండిపడ్డ ఎంపీ అర్వింద్

బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ ఎంపీ అర్వింద్ మండి పడ్డారు. సీఎం కేసీఆర్ వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు. 2018లో ఉత్తర్వులు వచ్చినప్పుడు తాగుబోతు సీఎం ఏం చేశావంటూ మండిపడ్డారు. 
మూడు ఏండ్లు నిద్ర పోయినావా అని నిలదీశారు. రాత్రి మందు కొట్టుకుంటూ కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నిర్ణయం తీసుకునేముందు ఆసలు ఉద్యోగులతో కేసీఆర్ చర్చించారా అంటూ అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ దీక్ష చేస్తుంటే పోలీసోళ్లకు కరోనా గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు, ధర్నాలు, మా పై దాడులు చేస్తే కరోనా రాదా ? అంటూ మండిపడ్డారు.టీఆర్ఎస్ పై పనిచేయని పోలీస్ లాఠీలు., బండి సంజయ్ ఆఫీసుల్లో పనిచేస్తాయా అంటూ విమర్శించారు. అప్పుడు నీ లాఠీలు ఏమి పీకుతున్నాయి అంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని ఎంపీ అర్వింద్ సీరియస్ అయ్యారు. మహేందర్ రెడ్డి లాంటి వారి వాళ్ల పోలీస్ వ్యవస్థ నాశనం అయిందన్నారు.టీఆర్ఎస్ కు ఎంతకు అమ్ముడుపోయావ్ అంటూ డీజీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భార్యా పిల్లల్ని చూడకుండా చేస్తున్నారు పోలీసులు. పొద్దున్నే లేచి ఎక్సర్ సైజ్ చేసుకోవడానికి లేదు అని ఆరోపించారు అర్వింద్. పోలీసులు ఏం తమాషాలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.