
టీఎస్ పీఎస్ సీ పేపర్ మరోసారి లీక్ కాదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్థులను కేసీఆర్ ఆగం చేసిండని మండిపడ్డారు. టీఎస్ పీఎస్ సీ బోర్డులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ పాత అధికారులతోనే పరీక్షలు పెడుతున్నారని షర్మిల అన్నారు. మళ్లీ పేపర్లు లీక్ కావన్న గ్యారంటీ కేసీఆర్ ఇస్తారా? అని ప్రశ్నించారు. 9 సంవ్సరాలుగా ఒక్క గ్రూప్ వన్ 1 పోస్టు భర్తీ చేయలేదన్నారు. పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్థులను సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆగం చేశారని విమర్శించారు షర్మిల. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్, పరీక్షల నిర్వహాణ, ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కు అఫిడవిట్ పంపించారు షర్మిల.
ఈ సారైన టీఎస్ పీఎస్ సీ పేపర్లు లీక్ కాబోవని.. కేసీఆర్ విద్యార్థులకు గ్యారంటీ ఇవ్వాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు. పేపర్ లీక్ ప్రభుత్వ వైఫల్యమేనని విద్యార్థులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ బిడ్డలకు కేసీఆర్ గ్యారంటీ ఇస్తున్నట్లుగా ఒక డిక్లరేషన్ పంపిస్తున్నామని వెల్లడించారు. ఎగ్జామ్స్ నిర్వహాణలో ఎలాంటి పాదర్శకత లేకుండా, ఫూల్ ప్రూప్ పద్దతిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాద్యత కేసీఆర్ తీసుకోవాలన్నారు. బిశ్వాల్ కమిటీ చెప్పిన లక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిక్లరేషన్ పై కేసీఆర్ సైన్ చేయాలన్నారు షర్మిల.
ఐటీ శాఖ మంత్రి, టెక్నిషియన్స్ సరిగా పనిచేస్తే పేపర్ లీక్ అయ్యేది కాదన్నారు. ఐటీ చట్టం ప్రకారం ప్రతి శాఖలోని ప్రతి సిస్టమ్ బాధ్యత ఐటీ శాఖదేనన్నారు. ఐటీశాఖ మంత్రిగా ఉండి.. కేటీఆర్ తనకు సంబంధం లేదంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల వల్ల పేపర్ లీకులు అయ్యాయని సిట్ మీకు చెప్పిందా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన అవసరం కేసీఆర్ కు ఉందని... ఇంత వరకు టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
https://www.youtube.com/watch?v=yNOzhcuJdyw