కేసీఆర్ కు ప్రజలపై చిత్తశుద్ధిలేదు

కేసీఆర్ కు ప్రజలపై చిత్తశుద్ధిలేదు

ఖమ్మం: సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధిలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు.  వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 86వ రోజు వైరా నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  లక్ష్మీపురంలో ఆమె మాట్లాడారు. 13 ఏళ్ల తర్వాత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నారనడానికే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడిన జనసందోహం నిదర్శమన్నారు. మహా నేతలకు మరణం లేదన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే తాను వైఎస్ఆర్టీ పార్టీని స్థాపించానని చెప్పుకొచ్చారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

పోడు భూములకు సంబంధించి ఒక్క ఎకరానికైనా కేసీఆర్ పట్టా ఇచ్చారా అని ప్రశ్నించారు. విద్య, వైద్యం గాడి తప్పిందన్న షర్మిల... రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యాన్ని బాగు చేసి పేదలకు కష్టాలు లేకుండా చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.3000 పెన్షన్లు ఇస్తామన్న ఆమె... రాజశేఖర రెడ్డి కూతురిగా మాట ఇస్తున్నా... తనను నమ్మండి అంటూ ప్రజలను కోరారు. 

మరిన్ని వార్తల కోసం...

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

బైకర్ను ఢీకొట్టిన కారు యజమాని