వైఎస్ షర్మిల దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు

వైఎస్ షర్మిల దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు

 వైఎస్ షర్మిల దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అమెను ఆరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై రవీందర్ ఫిర్యాదు మేరకు షర్మిలపై  353, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారును కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.  కారులో వెళ్లేందుకు యత్నించగా...కారును చుట్టుముట్టిన పోలీసులు.. డ్రైవర్ ను లాగి పడేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టేస్తూ ముందుకు సాగేందుకు యత్నించారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ను తోసేశారు. అయినా షర్మిలను మహిళా పోలీసులు గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేశారు.  దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

షర్మిల పోలీసులపై దాడి చేసినట్లు తెలిసిందని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. పర్మిషన్ లేకుండా షర్మిల సిట్ ఆఫీసుకు వెళ్తున్నారని..దాడిపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. షర్మిల సచివాలయంకు వెళ్తారని సమాచారం ఉందని సీవీ సీవీ ఆనంద్ తెలిపారు.  అందుకే ముందస్తు అప్రమత్తమయ్యామన్నారు. ఎస్సై ఫిర్యాదు ఆధారంగా షర్మిల కేసులో ముందుకెళ్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.