ఐటీ శాఖా మంత్రిగా.. పేపర్ లీక్తో తనకు సంబంధం లేదనడం సిగ్గు చేటు

ఐటీ శాఖా మంత్రిగా.. పేపర్ లీక్తో తనకు సంబంధం లేదనడం సిగ్గు చేటు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. ఇటీవల సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. నవీన్ చావుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ లే బాధ్యత వహించాలి అన్నారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నిరుధ్యోగం, యువతల చావులు జరుగుతున్నాయని విమర్శించారు. 

రాష్ట్రంలో 55 లక్షల మంది యువత నిరుద్యోగంతో ఉన్నారని, తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వం నిరుద్యోగులను, వాళ్ల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్.. అసెంబ్లీ సాక్షిగా 88 వేళ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి 26 వేళ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడని, తర్వాత 8 వేళ ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించాడని షర్మిల అన్నారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు ఐటీ శాఖా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఏం సంబంధం లేదనడం సిగ్గు చేటని అన్నారు. కేసీఆర్ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎవరికిచ్చారో వైట్ పేపర్ పై ఇవ్వాలని షర్మిల సవాల్ చేశారు. ఇంకొక నిరుద్యోగి ఆత్మబలి దానం కాకూడదని, సిరిసిల్లనే లాస్ట్ కావాలని షర్మిల కోరారు.