రైతులు చస్తున్నా కేసీఆర్కు పట్టించుకునే తీరికలేదు

రైతులు చస్తున్నా కేసీఆర్కు పట్టించుకునే తీరికలేదు

హైదరాబాద్: బంగారు తెలంగాణలో రైతులు బతకలేక చస్తున్నా సీఎం కేసీఆర్ కు పట్టించుకునే తీరిక లేదని  వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వారి బతుకులు బాగు చేద్దామన్న సోయి ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. ‘రైతులకు పనికి రాకున్నా, నిర్వాసితులు నిప్పంటించుకుని చచ్చినా, మీ కమీషన్లకు ఢోకా రాకుండా, లక్షల కోట్ల అప్పుతెచ్చి, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాజెక్టు కట్టి, ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో ఎలా కలుపుతున్నారో చూపించే KCR గారికి, బంగారు తెలంగాణలో రైతులు బతకలేక చస్తున్నా పట్టించుకునే తీరికలేదు’ అని షర్మిల ట్వీట్ చేశారు. బంగారు భారతదేశం చేయడానికి బయలుదేరుతున్న దొర ఆలోచనంతా మాటలతో మోసం చేయడం మీదేనని మండిపడ్డారు. ఆయన ధ్యాసంతా ఢిల్లీ కుర్చీ మీద.. మనసంతా దాచుకోవడం పైనేనని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఉక్రెయిన్‎పై రష్యా యుద్ధం.. లైవ్ అప్‎డేట్స్

ఆఖరి వన్డేలో భారత్ విక్టరీ

సైన్యం పరంగా... రష్యా బలమైందా? ఉక్రెయినా?