
కేసీఆర్ ఆఖరి గింజ వరకు ధాన్యం కొనాల్సిందేనన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. మూడు వారాల్లో ధాన్యం కొనకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. తనను ఆపడం కేసీఆర్ తరం కాదని..తనలో ప్రవహించేది వైఎస్సార్ రక్తం అని అన్నారు తెలంగాణలో పోలీసు జులుం నడుస్తుందన్నారు. కేసీఆర్ కు ఆడవారి నుంచి గండం ఉందని..అందుకే తన దీక్షను అడ్డుకుంటున్నారన్నారు. వరి కొనడం కేసీఆర్ కు చేతకావడం లేదన్నారు. పాలన చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే వడ్లు కొనేలా చేస్తానన్నారు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించేలా తీర్పునిచ్చారని.. త్వరలో రాష్ట్రమంతా కేసీఆర్ ను రాళ్లతో కొడతారన్నారు.