మహిళలంటే బీఆర్ఎస్కు గౌరవం లేదు : షర్మిల

మహిళలంటే బీఆర్ఎస్కు  గౌరవం లేదు : షర్మిల

రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మహిళలను గౌరవించే పార్టీ  బీఆర్ఎస్ కాదన్నారు. తన పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు మైల్ స్టోన్ దాటినప్పటి నుంచి అడుగడుగునా బీఆర్ఎస్ గుండాలు ఆడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. నర్సంపేటలో ఇప్పటికే ఇబ్బందులు క్రియేట్ చేశారని, తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రిపీట్ చేశారని షర్మిల తెలిపారు. ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ఆమె ప్రశ్నించారు.

తమ పార్టీకి ఆదరణ వస్తుందనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని షర్మిల విమర్శించారు.   ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాలకు సంబంధించిన వీడియోలను షర్మిల చూపించారు. ఓ మహిళను పట్టుకుని ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించారు. శంకర్ నాయక్ భార్య గిరిజనుల భూకబ్జాలు విషయంలో A1 ముద్దాయిగా ఉందని షర్మిల ఆరోపించారు.

ఒక మహిళ నిలబడి అవినీతి గురించి నిలదిస్తే ఇలా తనపై ఇలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. అవి మనుషులు మాట్లాడే మాటలేనా? కూడు తింటున్నారా? గడ్డి తింటున్నారా? అని షర్మిల ఫైరయ్యారు.  కేసీఆర్ ది దిక్కుమాలిన పాలన అని విమర్శించారు.