
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణ అంతటా కమలం వికసిస్తుంది అంటున్న మోడీ, మీ పూలు వికసించాలి.. మా తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టాలి. అంతేనా సారూ? కోచ్ ఫ్యాక్టరీ నుండి ITIR వరకు, విభజన హామీల నుండి 2 కోట్ల కొలువుల వరకు, ఇంకెన్ని పూలు వికసింపజేసుకుంటారు. ఎన్ని మా చెవిలో పెడతారు?” అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ హస్తినలో ఉంటే ఢిల్లీ కోటలు బద్దలు కొడతానంటున్న కేసీఆర్.. అదే ప్రధాని గల్లీకి వస్తే పిల్లిలా దాక్కున్నారని షర్మిల అన్నారు. మోడీకి ఎదురుపడి విభజన హామీలు అడిగే దమ్ములేదని విమర్శించారు. కాళేశ్వరం స్కాం మోడీ చేతిలో ఉందన్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 207వ రోజు మంథని నియోజకవర్గం కమాన్ పూర్ నుంచి పెద్దపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.పెద్దపల్లి మండలంలోని సబితం, గొల్లపల్లి, రంగాపూర్, రాఘవపూర్ గ్రామాల మీదుగా సాగుతోంది. ఇవాళ సాయంత్రం పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు.