సీఎం కేసీఆర్ ఏనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా తొండపల్లి నుంచి చిట్యాల, రాఘవాపూర్ మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి షర్మిల విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పరిగికి నీళ్లిస్తామని కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ కు ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకేనని ..ఎన్నికలుంటేనే బయటకు వస్తాడని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌజ్ కు వెళ్ళిపోతాడని అన్నారు. ఈ సారి కేసీఆర్ ను నమ్మొద్దని షర్మిల అన్నారు. కేసీఆర్ ప్రతి పథకం అబద్ధమేనని.. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.
