పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ ఇయ్యట్లే: షర్మిల

పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ ఇయ్యట్లే: షర్మిల

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మరోసారి నియంత అని నిరూపించుకున్నాడని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి పర్మిషన్ ఇవ్వటం లేదని ఆరోపించారు. కోర్టులు అంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గౌరవం లేదన్నారు. తనను మాత్రమే ఇంటి వద్ద వదిలిపెట్టి, తమ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేశారని చెప్పారు. శనివారం లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దీక్ష శిబిరం దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లపై కేసులు పెట్టి, న్యాయస్థానం చుట్టూ తిప్పాలనేదే కేసీఆర్ టార్గెట్ అని మండిపడ్డారు. తమ పార్టీ నేతలను ఎలాంటి కారణం లేకుండానే అరెస్ట్ చేసి కేసులు పెట్టారని, పాత కేసులు తవ్వి, రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  

శూర్పనఖ అని నేనంటే..

“శిఖండి అని తోటి మహిళను పట్టుకుని ఒక మహిళా ప్రజాప్రతినిధి దూషించింది. నేను గనుక ఆమెను శూర్పనఖ అంటే.. ఆమె తన ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? కానీ అలా అనే సంస్కారం నాది కాదు. గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ఏనాడైనా మహిళల కోసం నోరు విప్పిందా? గిరిజన మహిళలను చీరలు పట్టి లాగి కొడుతుంటే ఏనాడైనా అడిగిందా? మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏనాడైనా ప్రశ్నించిందా? మరియమ్మ అనే దళిత మహిళను లాకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొట్టి చంపితే స్పందించిందా? జుట్లు పట్టుకుని పిల్లల తల్లులను కేసీఆర్ జైలులో పెడితే నోరు విప్పిందా? నన్ను మాత్రం శిఖండి అంటుందా? కొంచమైనా ఇంగితం ఉందా? పదవి ఉండగానే సరిపోతుందా? పదవికి తగ్గ హుందాతనం ఉండొద్దా? వ్యక్తిగత దూషణలు చేసింది నేనా.. మీరా?” అని షర్మిల ఫైర్ అయ్యారు. తమ పార్టీ ఆఫీసు చుట్టూ విధించిన కర్ఫ్యూ ఎత్తేయాలని, అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేయాలని, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. అప్పటిదాకా దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు.

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్ చేయాలె

శనివారం సాయంత్రం సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్లు, వైఎస్ సునీతా రెడ్డి (వైఎస్ వివేకానందరెడ్డి కూతురు).. షర్మిలకు టెస్టులు చేశారు. అరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని డాక్టర్ తెలిపారు. 30 గంటలుగా మంచి నీళ్లు సైతం తీసుకోవడం లేదని, వెంటనే ఆసుపత్రిలో చేర్చకపోతే షర్మిల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు.

లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కర్ఫ్యూ

శనివారం కూడా లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీక్ష వద్దకు పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అను మతించలేదు. లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ఉద్యోగులు, ఆఫీస్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బయట నుంచి లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం పోలీసులు అనుమతించలేదు. మరోవైపు బొల్లారం పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నుంచి పీఎస్ లోనే ఉంచటంతో సోమన్నకు షుగర్ లెవల్స్ పడిపోగా, వెంటనే హాస్పిటల్ కు తరలించారు. బొల్లారం పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 మందిని, బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడుగురిని ఉంచినట్లు పార్టీ నేతలు తెలిపారు.