ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం

ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం

తెలంగాణలో వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా తాను ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను చేస్తున్నానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల బుధవారం నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇడుపులపాయ‌లోని వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి స‌మాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘వైయస్సార్ సంక్షేమ పాలన అంటే రైతులకి ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ. వైయస్సార్ పాలన అంటే పేద పిల్లలకు ఉచిత విద్య, పేద వాళ్ళకి ఉచిత వైద్యం అందివ్వడం. ఈ రోజు తెలంగాణలో వైయస్సార్ సంక్షేమ పాలన ఉందా అని అడిగితే లేదు అనే సమాధానమే వస్తుంది. ఇది నా సమాధానం కాదు. ఇది తెలంగాణ ప్రజల సమాధానం. వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మేం బుధవారం నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర మొదలు పెడుతున్నాం. రాష్ట్రమంతా తిరుగుతాం.. ప్రతి పల్లెకు పోతాం.. ప్రతి గడపను తడతాం. ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల కష్టాలను వారి నోటి నుంచి వింటాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం.. ప్రజల పక్షాన నడుస్తాం. వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న ఈ పాదయాత్రను తెలంగాణ ప్రజలు, వైఎస్సార్ అభిమానులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మా అడుగులో అడుగు వేయండి. మనమంతా కలిసి పోరాడితే వైయస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే సాధ్యమే’ అని వైఎస్ షర్మిల అన్నారు.

For More News..

దళితబంధు ఆపాలని మేం చెప్పినట్లు నిరూపిస్తారా?

టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు

భర్తతో గొడవపడి బయటకొచ్చిన మహిళపై అత్యాచారం