టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు

టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు

కరీంనగర్: హుజురాబాద్‎కు కేటీఆర్‎ను పంపిస్తే కొడుకు ఫేయిలవుతాడని కేసీఆర్ భయపడి హరీశ్‎ను పంపించాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన హుజూరాబాద్‎లో మాజీ మంత్రి విజయరామారావు, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల భాషా‎లతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

‘దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండస్ట్రీలకు సబ్సిడీ ఇస్తానన్నాడు. దళితులకు 50 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్థిక పరిస్థితి బాగు చేస్తానన్నాడు. దళిత ముఖ్యమంత్రి అని గతంలో అన్న కేసీఆర్.. ప్రజలు తననే సీఎం కావాలని కోరినట్లు నిన్న చెబుతున్నాడు. రాష్ట్రంలో అప్పుల పాలన చేస్తున్నాడు. ఏ ఒక్క మంచి పని చేయడం లేదు. మీ మేనిఫెస్టో ప్రకారం దళితులకు మూడెకరాలు ఇస్తానన్నాడు. 5 లక్షలకు ఎకరా కొనిస్తానంటే సరిపోవని నేను అప్పట్లో చెప్పాను. పదిలక్షలైనా కొనిస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకుంటే 60 లక్షల ఆస్తి దళితులకు ఉండేది. దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోగా.. ఇప్పుడు కొడుకుని చేస్తానని ఆలోచన చేస్తున్నాడు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను చేసి.. అనవసర ఆరోపణలు రావడంతో తీసేసాడు. దళితుల మీద సీఎంకు ప్రేమ ఎక్కడ ఉందో చెప్పాలి. 250 మంది ఆఫీసర్లకు ఎక్స్‎టెన్షన్ ఇచ్చినా ఒక్క దళిత అధికారి కూడా లేడు. సీఎంవోలో ఒక్క దళిత ఆఫీసర్ కూడా లేడని ఈటల ప్రశ్నిస్తే ఒక్కరిని తీసుకున్నాడు. 31 జిల్లాల్లో ఎంత మంది దళిత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు? మురళీ లాంటి దళిత ఐఏఎస్ అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వకుండా అన్యాయం చేశాడు. ఇప్పుడు దళితబంధు అనే పథకం ప్రారంభించాడు. నిజంగా ప్రేమ ఉంటే అకౌంట్లో డబ్బులు వేయాలని ఈటల నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని.. అకౌంట్లో డబ్బులు వేసి అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఇదో కొత్తరకం స్ట్లైల్. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే అప్పుడే ఎందుకు పంపిణీ చేయలేదు. బీజేపీ సహా చాలా మంది వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే సర్వే అన్నారు. ఎందుకు సర్వే..? ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే.. కొత్త స్కీంలను హోల్డ్‎లో పెడతారని కేసీఆర్‎కు తెలుసు. కావాలనే అకౌంట్లు ఫ్రీజ్ చేసి.. నోటిఫికేషన్ వచ్చాక.. ఆయనే లేఖ రాసి ఆపించారు. ఇప్పుడు బీజేపీపై నిందలు వేయడాన్ని ఖండిస్తున్నాం. దళితులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. డబుల్ గ్రాడ్యుయేట్ చేసి ఖాళీగా ఉన్నారు. ఫామ్ హౌస్ వాళ్లు కట్టుకున్నారు తప్ప..  డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. ఈటల రాజేందర్‎ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు’ అని వివేక్ అన్నారు.

ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు

తాను బీజేపీని వదిలి కాంగ్రెస్‎లో చేరుతాననే ఊహాగానాలపై వివేక్ స్పందించారు. మేం బీజేపీని ఎందుకు వీడిపోవాలని ప్రశ్నించారు. బీజేపీని బలోపేతం చేయాలని ప్లాన్‎తో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో బీజేపీని గెలిపించేందుకు కీలకంగా పనిచేశాను. ఈటలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషించాను. బీజేపీని గెలిపించేందుకు నాలుగు నెలలుగా ఇక్కడే ఉంటున్నా. మా నాన్న పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు.. హుజురాబాద్ కూడా ఆయన పరిధిలోనే ఉండేది. ఎక్కడికి వెళ్లినా మా నాన్నను గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీని స్ట్రాంగ్ చేయడానికి కృషి చేస్తాం. కేసీఆర్ నియంతృత్వ పాలన పోవడానికి పోరాడుతాం. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు. వర్కింగ్ ప్రెసిడెంట్‎గా సారు, కారు, 16 అని 7 సీట్లు ఓడిపోయాడు. జీహెచ్ఎంసీలో గతంలో 99 సీట్లు గెలిస్తే.. ఈసారి 54 సీట్లు మాత్రమే గెలిచాడు. కేసీఆర్ భయపడి హుజురాబాద్‎కు కేటీఆర్‎ను పంపిస్తే కొడుకు ఫేయిలవుతాడని కేసీఆర్ భయపడి హరీశ్‎ను పంపించాడు. హరీశ్, ఈటల మంచి మిత్రులు. కానీ వారి మధ్య చిచ్చుపెట్టి.. హరీశ్‎ను ఇంచార్జీగా పంపించారు. కేటీఆర్ ఛాలెంజ్‎గా తీసుకుని ఇక్కడికి వచ్చి కొట్లాడితే బాగుండేది. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ నియంతృత్వంపై ఆ పార్టీలోని వారే ప్రశ్నిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తారు. ఈటల రాజేందర్ కోసం నేను ప్రచారం చేస్తున్నాను. కేవలం ఓటమి భయంతోనే ఇలాంటివి మాట్లాడుతున్నారు. మొన్న కూడా బాల్కసుమన్ మాట్లాడుతూ.. మొనగాడు ఎవరో రమ్మను అని మాట్లాడుతున్నాడు. మొనగాడు ఎవరో కేసీఆర్‎ను అడిగితే చెబుతారు. సుమన్‎ను ఓడించడానికి మా నాయకుడు అందుగుల శ్రీనివాస్ సరిపోతాడు. సుమన్ భాష మార్చుకోవాలి. మా గ్రామాలన్నింటిని తాగుబోతుల గ్రామాలుగా మార్చారని ప్రజలు బాధపడుతున్నారు. నాగార్జున సాగర్‎లో లిక్కర్ తాగించి, బిర్యానీ తినిపించి వాడుకుని వదిలేశారు. ఇక్కడ కూడా యువకులను తాగుబోతులుగా మారుస్తున్నారు. ఈ ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతోంది. ఈటలను అణచివేయాలన్న కుట్రకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునీయాలి’ అని వివేక్ వెంకటస్వామి అన్నారు. 

For More News..

భర్తతో గొడవపడి బయటకొచ్చిన మహిళపై అత్యాచారం

మన సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?

ఈటల రాజేందర్ గెలిస్తే ఏంవస్తుందో చెప్పాలి?