భర్తతో గొడవపడి బయటకొచ్చిన మహిళపై అత్యాచారం

V6 Velugu Posted on Oct 19, 2021

బీహార్‎లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితను గదిలో బంధించి వారం రోజులపాటు అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాకు చెందిన వివాహిత తన భర్తతో గొడవపడి అక్టోబర్ 10న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కలకత్తా వెళ్లాలనుకున్న మహిళ.. ట్రైన్ కోసం పాట్నా జంక్షన్‎కు చేరుకుంది. ట్రైన్ వివరాల కోసం ఓ హోటల్ యజమాని గోపాల్‎ని అడిగింది. ఆ మహిళ గురించి గోపాల్ తన స్నేహితులైన అమిత్, అజయ్‎లకు చెప్పాడు. వీరు ఆ మహిళకు కర్బిగహియా ప్రాంతంలోని ఒక హోటల్‎లో రూం చూపించి.. ట్రైన్ వచ్చేవరకు అక్కడ ఉండాలని సూచించారు. కొన్ని గంటల తర్వాత వీరు ముగ్గురు ఆ మహిళ గదిలోకి వెళ్లి లైంగిక దాడి చేశారు. అనంతరం వీరి స్నేహితులైన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు కూడా మహిళపై అత్యాచారం చేశారు. ఈ విధంగా మహిళను గదిలో బంధించి.. అక్టోబర్ 17 వరకు పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పారిపోకుండా ఉండేందుకు గది బయట ఒక వ్యక్తి ఎప్పుడూ కాపాలాగా ఉండేవాడు. 

అయితే ఇంటి నుంచి వెళ్లిన భార్య కోల్‌కతా చేరుకోకపోవడంతో.. ఆమె భర్త జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె మొబైల్‌ చివరిసారిగా ఎక్కడ లోకేట్ అయిందో గుర్తించారు. అనంతరం పాట్నా జంక్షన్‌లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. స్థానికులను విచారించిన తర్వాత బాధితురాలిని బందీగా ఉంచిన ఇంటికి చేరుకున్నారు. అక్కడ మహిళను రక్షించి.. గది ముందు కాపాలాగా ఉన్న గోలు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గోలు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరో నలుగురు నిందితులైన గోపాల్ కుమార్, అమిత్ కుమార్, అజయ్ కుమార్ మరియు అరుణ్‎లను అరెస్టు చేశారు.

For More News..

 

మన సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?

ఈటల రాజేందర్ గెలిస్తే ఏంవస్తుందో చెప్పాలి?

హరీశ్ రావుని ఉద్యోగాలడిగిందని యువతిని అలా కొడతారా?

Tagged bihar, GANG RAPE, Rape, patna, Karbigahiya, rape on hotel room, Patna gang rape

Latest Videos

Subscribe Now

More News