కేసీఆర్.. నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోరా?

కేసీఆర్.. నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోరా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దన్నారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. పట్టించుకోవడం లేదని కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. ఆయన సిగ్గుతో, అవమానంతో తలదించుకోవాలన్నారు.

'తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, ఏడెండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్ల‌ను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి' అని షర్మిల ట్వీట్ చేశారు. 'డిగ్రీ, పీజీలు చదివి హమాలీ పని' అనే శీర్షికతో వీ6 వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ ట్వీట్ కు జత చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కెమికల్ చాయ్‌లతో డేంజర్

ఉద్యోగుల కోసం బీజేపీ ఉద్యమం

ఏడేళ్ల వయసుకే కిలిమంజారో ఎక్కిన విరాట్