కొండంత రాగం తీసి పిల్లికూతా.?..బీఆర్ఎస్ మేనిఫెస్టోపై వైఎస్ షర్మిల ఎద్దేవా

కొండంత రాగం తీసి పిల్లికూతా.?..బీఆర్ఎస్ మేనిఫెస్టోపై వైఎస్ షర్మిల ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో  కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. పోయిన ఎన్నికల హామీల అమలుకే దిక్కులేదంటే, ఇప్పుడు మళ్లీ కొత్త కథ మొదలుపెట్టిండన్నారు. బతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి.. చనిపోయాక బీమా ఇస్తామంటున్నారని ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు. 

జీరో వడ్డీ రుణాలు అని మోసం చేసి, ఇప్పుడు ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. గత మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతికే దిక్కులేదు.. ఇప్పుడు రూ.3 వేలు ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. ‘రుణమాఫీపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నాడు. ఉద్యోగాలు ఇవ్వలేక చేతులెత్తేశాడు. ఉన్న స్కీమ్​లను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త స్కీంల పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు’ అని ఆమె ఫైర్ అయ్యారు.