రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు

కేసీఆర్ అవినీతి పాలనను పాతిపెట్టేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీని గంగలో కలిపేందుకు ప్రజాప్రస్థానం సాగుతుందన్నారు. అయ్యా కొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లే కానీ.. పూటకు బత్తెం ఇచ్చేటోళ్లు కాదన్నారు. ప్రగతి భవన్ కే  నీళ్లు,నిధులు, నియామకాలు వెళ్తున్నాయన్నారు. శవాల మీద పైసలు ఏరుకునే కేసీఆర్ పాలనలో తెలంగాణ.. బారుల తెలంగాణగా మారిందన్నారు.  మద్యం అమ్మకాలు 300 శాతం పెరిగాయని.. మహిళలపై దాడులు కూడా అంతేస్థాయిలో పెరిగాయన్నారు.

మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారన్నారు వైఎస్ షర్మిల..బీసీలు ఇంకెన్ని రోజులు గొర్రెలు, బర్రెలు కాయాలన్నారు. మహిళలు చట్టసభల్లో ఉండాలన్నారు. యువత కొత్త తరం రాజకీయం కోరుకుంటుందన్నారు. ఏడేళ్లుగా తెలంగాణలో ప్రశ్నించే మగాడు లేడన్నారు. అందుకే ఆడింది ఆటగా సాగుతుందన్నారు. దమ్ముంటే పాదయాత్రకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు షర్మిల. రాష్ట్రంలో సమస్యలు లేకపోతే తాను ముక్కు నెలకు రాస్తానని.. సమస్యలుంటే మీరు రాజీనామా చేస్తారా  అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడన్నారు. రేవంత్లా బ్లాక్ మెయిలింగ్ చేతకాదన్నారు. ఎవరిది ఎన్జీవోనో, ఎవరరిది రాజకీయమో ప్రజల తేలుస్తారన్నారు. రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతుల్లోనే ఉందన్నారు. బీజేపీ ,టీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయన్నారు. కేసీఆర్ ను జైల్లో పెడతానంటున్న బండి సంజయ్ ఎందుకు ఆధారాలు బయటపెట్టడం లేదన్నారు.