3400కి.మీ దాటిన వైఎస్ షర్మిల పాదయాత్ర

3400కి.మీ దాటిన వైఎస్ షర్మిల పాదయాత్ర

భూపాలపల్లి మండలం కొంపల్లిలో వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3400 మైలు రాయి దాటిన నేపథ్యంలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

3400 కి. మీ. నడించింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజల అభిమానమేనని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసం పార్టీ పెట్టానని ఈ సందర్భంగా షర్మిల మరోసారి చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ప్రతీ పథకానికీ పునర్వైభవం తెస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చేది కాదన్న ఆమె... ఆరోగ్య శ్రీ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వదని విమర్శించారు. ప్రజా సంక్షేమం కేసీఆర్ కి పట్టదని షర్మిల మండిపడ్డారు.