తెలంగాణ సమస్యలు తెలుసుకునే యాత్ర ఇది: వైఎస్ విజయమ్మ

తెలంగాణ సమస్యలు  తెలుసుకునే యాత్ర ఇది: వైఎస్ విజయమ్మ

రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎంతో మంది పాదయాత్రకు అడ్డంకులు సృష్టించినా...యాత్ర ఆపాలని ఎన్నో కుట్రలు చేసినా..షర్మిల తలవంచలేదు..తలదించలేదన్నారు. సంకల్పంతోనే పాదయాత్ర చేస్తూ...ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటోందని చెప్పారు. షర్మిల అంటే ఏమిటో..ఆమె గుణం ఏమిటో ఈ యాత్ర ద్వారా తెలిసిందన్నారు. షర్మిల పరిణితి చెందినట్లు ఈ యాత్ర ద్వారా తనకు తెలిసిందని చెప్పారు. వైఎస్ షర్మిల పాదయాత్ర 3వేల కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడారు. 

మిగులు బడ్జట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు..
ఏ ఆశయం కోసమైతే ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో..ఆ ఆశ..ఆకాంక్ష నెరవేరలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. మిగుల బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ప్రభుత్వ తప్పులను షర్మిల పాదయాత్ర ద్వారా వెలికితీస్తోందన్నారు. సమస్యలను వెలికితీయడంతో పాటు..వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ప్రతిపక్షాలను తట్టిలేపుతూ..ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేస్తుందన్నారు. కాంగ్రెస్ YSRకి చేసిన మోసం... తెలంగాణకు బీజేపీ మోసంపై షర్మిల ప్రశ్నిస్తుందన్నారు.