
ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ లో దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘మయసభ’.విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. శనివారం టీజర్‌ను విడుదల చేశారు.
ఇద్దరు గొప్ప స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడుగా ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డిగా చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా కనిపించారు.
సిరీస్‌లోని రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య వచ్చే సన్నివేశాలు, ‘‘చివరికి పిల్లనిచ్చిన మామ తోనే ఉనికి కోసం పోరాడుతున్నాను.., ఈరోజు నువ్వు గెలిస్తే... ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది” లాంటి డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలను గుర్తుచేసేలా ఉన్నాయి. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.