పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేసి తీరుతం

పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేసి తీరుతం

విజయవాడ: ఎన్ని అడడంకులు వచ్చినా పోతిరెడ్డిపాడు పనులను వంద శాతంపూర్తి చేసి తీరుతామని ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిఅన్నారు. తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని, అదనంగా తీసుకోవట్లేదన్నా రు. రాజకీయాల కోసంరెచ్చగొట్టొద్దన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది కొత్తదేమీ కాదు. మా వాటా తీసుకునే ప్రయత్నంలో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ చేపట్టాం . అడిషనల్ గా నీటిని తీసుకోవట్లే. మొన్నశ్రీ శైలంలో వాటర్ లెవెల్ 854 అడుగులకు వచ్చింది. రెండ్రోజులు ఫ్లడ్ ఆగిపోతే 830కి వెళ్లిపోయింది. ఇలా అయితే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లుఎలా వెళతాయి? తెలంగాణ వాళ్లుపవర్ జనరేషన్ కోసంనీటినికిందికి వదిలేస్తున్నారు.

రాయలసీమ ప్రాంత వాసులు ఎలా బతకాలి? కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవాళ్లు80 వేల ఎకరాలు పోగొట్టుకున్నారు. వాళ్లందరికీ న్యాయంజరగాలి కదా? పవర్ జనరేషన్ కోసం నీటిని కిందికి వదిలేస్తున్నారు. 881 అడుగులు వచ్చే వరకు ఉండనీయడం లేదు. అలాంటి పరిస్థితి లో 830, 820 డెడ్ స్టోరేజీ ఉన్నప్పుడు కూడా మావాటా మేము తీసుకుంటం. పైనుంచి తీసుకునేదికింది నుంచి తీసుకుంటం. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టుల నుంచి నీటినిడ్రా చేస్తున్నారు. ఎవరైనా రైతుల గురించి ఆలోచించాలి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టరాదు. 881కి రానిచ్చే పరిస్థితి లేదు కాబట్టి కింది నుంచి తీసుకుంటంఅని అంటున్నం. ఇందులో తప్పే ముంది? ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్నా. వాళ్లప్రయోజనాలు కాపాడుకునేందుకు వాళ్లుమాట్లాడుతున్నారు. ఒక ప్రాంతానికి నష్టం జరిగేలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. తెలంగాణలో అన్ని పార్లు టీ ఒక్కటై పోరాడుతున్నాయి. ఏపీలో మాత్రం టీడీపీ నోరు తెరవడం లేదు’ అని మండిపడ్డారు.