BMW కారు హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ ఎంపీ కుమార్తె అరెస్ట్, బెయిల్

BMW కారు హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ ఎంపీ కుమార్తె అరెస్ట్, బెయిల్

తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీలో జరిగిన BMW కారు హిట్ అండ్ రన్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె డ్రైవ్ చేస్తున్న BMW కారు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నిద్రపోతున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతను చనిపోయాడు. ఈ హిట్ అండ్ రన్ కేసులో.. వైసీపీ ఎంపీ కుమార్తె మాధురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు మాధురి. 

2024, జూన్ 17వ తేదీ రాత్రి వైసీపీ ఎంపీ బీద మస్తానరావు కుమార్తె మాధురి.. తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్‌లో తన బీఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా.. కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పై నిద్రపోతున్న 24 ఏళ్ల పెయింటర్ సూర్యపై నుంచి వెళ్లింది ఆమె కారు. ఘటన తర్వాత మాధురి అక్కడి నుంచి పారిపోయారు. 

పోలీసులు సీసీటీవీ పరిశీలించగా.. ప్రమాదానికి కారణమైన కారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు గ్రూపు పేరిట..  పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. కారుని ఎంపీ బీద మస్తానరావు కుమార్తె మాధురి డ్రైవ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు.  ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. బీద మస్తాన్‌రావు 2022లో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీఎంఆర్ గ్రూప్ అనేది సీ ఫుడ్ ఎక్స్ పోర్టు వ్యాపారంలో ఉంది.