ఇది బాగోలేదు : అగ్గిపెట్టె గుర్తు కావాలంటున్న షర్మిల

ఇది బాగోలేదు : అగ్గిపెట్టె గుర్తు కావాలంటున్న షర్మిల

తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన  బైనాక్యులర్ గుర్తుపై  వైఎస్ఆర్టీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ చీఫ్ షర్మిల సీఈసీ ఆశ్రయించారు.  బాల్,  అగ్గిపెట్టె గుర్తులు ఖాళీగా  ఉండటంతో ఈ రెండు గుర్తులలో ఏదో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని షర్మిల  సీఈసీని కోరారు.  బాల్ గుర్తుపై  వైఎస్ఆర్టీపీ  చీఫ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తో్ంది.  కాగా అంతకుముందు నాగలి గుర్తు కోసం వైఎస్ఆర్టీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.  

Also Read :- కాంగ్రెస్​లో చేరిన రాజగోపాల్ రెడ్డి

కాగా  వైఎస్ఆర్టీపీకి ఎన్నికల గుర్తుగా బైనాక్యులర్‌ను ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న  ఉత్తర్వులు జారీ చేసింది.  వైఎస్ఆర్టీపీ అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించాల్సిందిగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించింది. 2023 నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా షర్మిల ప్రకటించారు.  పాలేరు నుంచి షర్మిల బరిలో దిగనున్నారు.