గవర్నర్ తమిళి సైతో షర్మిల భేటీ

గవర్నర్ తమిళి సైతో షర్మిల భేటీ

హైదరాబాద్: గవర్నర్ తమిళి సైతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన షర్మిల...  రాష్ట్రంలోని సమస్యల గురించి చర్చించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి కుమ్మక్కై రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్లు గవర్నర్ కు షర్మిల కంప్లైంట్ చేశారు. అలాగే కాళేశ్వరం ముంపు, వర్షాల వల్ల కల్గిన నష్టం గురించి కూడా గవర్నర్ కు వివరించారు.

అవినీతికి పాల్పడిన కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై  వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ.. గవర్నర్ తో వైఎస్ షర్మిల భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక... రేపటి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ లో షర్మిల తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.