వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్: బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‎లో నిరుద్యోగ దీక్షకు అనుమతి లేకున్నా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సాధిస్తామన్నారు. నిరుద్యోగ దీక్షకు అనుమతివ్వకపోవడంపై నిరసన తెలుపుతూ.. బోడుప్పల్ నుంచి మేడిపల్లి పీఎస్‎కు పాదయాత్రగా బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మరియు పోలీసులకు మధ్య కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యువకులు, ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను లోటస్ పాండ్‎కు తరలించారు.