వెండి ధర ఢిల్లీలో మంగళవారం రూ.ఆరు వేలు పెరిగి కిలో రూ.2.71 లక్షలకు చేరుకుంది. ఇది వెండి ధరల్లో సరికొత్త రికార్డు. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ.1.45 లక్షల వద్ద ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి వెండి ధర కిలోకు రూ.32 వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. స్టాకిస్టులు కొనుగోలు చేస్తుండటంతో బంగారం, వెండి ధరలు తగ్గడం లేదు. ఇక ముందూ ధరలు పెరగవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణుడు ఒకరు తెలిపారు.
