కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో కరెంటు బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే అన్నారు. మొన్నటి వరకు 80 యూనిట్లకు 188రూపాయలు వచ్చిన బిల్లు.. ఇప్పుడు ఏకంగా 307 రూపాయలకు చేరిందన్నారు. పెరిగిన ఛార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు బతకడం భారంగా మారిందని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు ఛార్జీలు పెంచి, జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం

RRR నుండి కొత్త ట్రైలర్

కొత్త టెక్నాలజీ: నొప్పులు లేకుండానే కాన్పు