80వేల బుక్కులు కాదు..ముందు రాజ్యాంగం చదువు: వైఎస్ షర్మిల

80వేల బుక్కులు కాదు..ముందు రాజ్యాంగం చదువు: వైఎస్ షర్మిల

80 వేల పుస్తకాలు చదివిన అని గప్పాలు కొట్టుకునే సీఎం కేసీఆర్..ముందు రాజ్యాంగాన్ని చదవాలని వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించాలని ప్రయత్నించిన సీఎం కేసీఆర్ భంగపాటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తూ కోర్టుల్లో కేసీఆర్ అడ్డంగా దొరికిపోతున్నారని విమర్శించారు.

బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కి నవ్వుల పాలయ్యాడని చురకలంటించారు. బడ్జెట్ ను ఆమోదించేలా గవర్నర్ ఆదేశించాలని కోర్టుకెళ్లే కేసీఆర్ కు..నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో మాట్లాడే ధైర్యం లేదా అని ప్రశ్నించారు.  కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ కేసీఆర్ బుర్ర పనిచేయదా అని మండిపడ్డారు.