చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా?

చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా?

హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణాను కేసీఆర్ దగా చేస్తున్నారని వైఎస్సార్ టీపీ నేత ఇందిరా శోభన్ అన్నారు. కవితకు ఆగమేఘాల మీద ఉద్యోగం కల్పించిన కేసీఆర్.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. చస్తేనే ఉద్యోగాలు ఇస్తారా అని క్వశ్చన్ చేశారు. ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని, తర్వాత వాటి ఊసెత్తరని విమర్శించారు. 

‘నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం వైఎస్సార్ టీపీ కొట్లాడుతుంది. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే నోటిఫికేషనులు గుర్తుకొస్తాయి, తర్వాత వాటి ఊసెత్తరు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే యువత ఎలా బతికేది. ప్రతి ఊరిలో ఉన్న నిరుద్యోగి గడప తొక్కుతాం. షర్మిల పార్టీ ప్రకటనతో కొంత మార్పు కనిపిస్తోంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ఏడేళ్లలో 14 కోట్ల జాబ్స్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్ని భర్తీ చేశారో, అందులో తెలంగాణ వాటా ఎంతో ఆ పార్టీ నేతలు చెప్పాలి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవాళ్లకు తప్ప ఇంకెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని ఇందిరా శోభన్ దుయ్యబట్టారు.